విడుదల సిద్ధంగా ‘నీ ఊహల్లో నే ఉంటా’..

215
Nee Oohallo Ne Unta

దర్శకత్వ శాఖలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన ప్రతిభాశాలి పురందర్ దాస్.కె స్వీయ దర్శకత్వంలో.. కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై.. మధులత నిర్మాణ సారధ్యంలో రూపొందించిన యాక్షన్ ఓరియంటెడ్ ప్రేమకథా చిత్రం ‘నీ ఊహల్లో నే ఉంటా’. మనోజ్ కోడూరు, పర్లి భారతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో గోపాల్ పావగాడ, సంధ్య, శ్రావణి, ఆది మామిళ్ళ, హిందూనాథ్, మంజునాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నవ్య ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nee Oohallo Ne Unta

దర్శకనిర్మాత పురంధర్ దాస్.కె మాట్లాడుతూ.. ‘తన మిత్రులకు జరిగిన అన్యాయాన్ని ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేసాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. యాక్షన్ తోపాటు వినోదానికి పెద్ద పీట వేస్తూ పగ నేపథ్యంలో రూపొందిన చక్కని ప్రేమ కథ ‘నీ ఊహాల్లో నే ఉంటా’. దాదాపుగా అంతా కొత్త తారాగణంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

 Nee Oohallo Ne Unta

ఈ చిత్రానికి డాన్స్: వన్నూర్ కుమార్, ఛాయాగ్రహణం: ఎస్.కె.ఎం షరీఫ్, సంగీతం: రాజ్ కిరణ్, ఆర్.ఆర్: సి.ఎన్ ఆదిత్య, ఎడిటర్: ఎస్.జె.శివకిరణ్, నిర్మాణ సారధ్యం: మధులత, కథ-మాటలు-పాటలు-నిర్మాత-దర్శకత్వం: పురందర్ దాస్.కె!!