- Advertisement -
భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలం అయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పలుచోట్ల రోడ్ల మీదకు వరద నీరు భారీగా చేరగా నీటి ఉదృతికి వంతెనలు ప్రమాదకస్థాయిలో ఉన్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న వంతెన ద్వారా అమ్లావా నదిని దాటడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరో 10 మంది గల్లంతు అయ్యారు. కొండచరియలు, వరదలు కారణంగా చండీగఢ్ మనాలి హైవేతో సహా 60 కి పైగా రోడ్లుమూతబడ్డాయి. ఇక వరదల కారణంగా పలుచోట్ల ఆరెంట్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.
- Advertisement -