ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో మోడీ ప్రభుత్వపు 3వ వార్షికోత్సవ సంబరాలు, ఎడిసన్, న్యూ జెర్సీ లోని టీవీ ఆసియా స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ పదాధికారులు మరియు ఇతర సంఘాల నాయకులు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది.
ఈ సంధర్బంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు సభను ఉద్యేశించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వము గడిచిన 3 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు . అలాగే భారతీయ జనతా పార్టీ గడిచిన 3 సంవత్సరాలలో సాధించిన ప్రగతి మరియు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎలా ఎదిగిన తీరును వివరించారు.

ఆ తరువాత సీమ సాబు దేశ భక్తి పాటతో ప్రవాస భారతీయులను అలరించారు. అనంతరం ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ జాతీయ యువ కో-కన్వీనర్, శ్రీ దీప్ భట్ యువత మరియు నిరుద్యోగానికి సంబందించిన సమస్యలపై మోడీ ప్రభుత్వం చేసిన కృషిని మరియు సాధించిన ప్రగతిని వివరించారు.
మహిళా సాధికారత కోసం మోడీ ప్రభుత్వము చేపట్టిన అనేక కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని గురించి శ్రీ కల్పన శుక్ల, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు, వివరించారు . అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్తలో మోడీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్ , అలాగే ఇటీవల అమలు చేసిన GST ఒకేదేశం – ఒకేపన్ను గురించి శ్రీ గుంజన్ మిశ్ర వివరించారు.
ఆ తరువాత ఓఎఫ్ బిజెపీ మీడియా కో కన్వీనర్, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే , దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని మరియు సర్జికల్ స్ట్రయిక్స్ , వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) మరియు ఇతర దేశాలతో చేసుకొన్న రక్షణ ఒప్పందాలు తదితర విషయాల గురించి తెలిపారు .

ఓఎఫ్ బిజెపీ, జాతీయ యువ కో-కన్వీనర్, శ్రీ విలాస్ జంబుల గ్రామీణ భారత అభివృద్ధికి మోడీ ప్రభుత్వము చేపట్టుతున్న అనేక కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, విద్యుదీకరణం, గ్రామీణ ఉపాధి, గ్రామీణ సంక్షేమ మరియు వేప పూత పూసిన యూరియా సరఫరా తదితర విషయాలను వివరించారు.

ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్ , ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల , బాలగురు , కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీ నీలిమ మదన్, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కోఆర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్, ఫైనాన్స్ కన్వీనర్ ఆత్మసింగ్, ఓఎఫ్ బిజెపీ ఫిలడెల్ఫియా కోఆర్డినేటర్ శ్రీ డా. సంజయ్ గుప్త , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు శ్రీ ఆనంద్ జైన్, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్ శ్రీ దిగంబర్ ఇస్లాంపురే , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ మెంబర్షిప్ కన్వీనర్ శ్రీ ప్రమోద్ భగత్ , ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల , శ్రీ దీప్ భట్ , , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్, మరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు గుంజన్ మిశ్ర, ప్రదీప్ రెడ్డిలతో పాటు చాలా మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొన్నారు.

