డబుల్ బెడ్‌రూమ్‌ స్కీం..భేష్:నందకుమార్

523
ncst
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఒక మంచి ఆలోచన అన్నారు ఎన్‌సీఎస్టీ కమిషన్ చైర్మన్ నంద కుమార్. బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన NCST(నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ) చైర్మన్.. తండా లను గ్రామ పంచాయితీ లుగా , తెలంగాణ కు హరితహారం లాంటి ఎన్ని మంచి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

ఎస్టీ ల సమగ్ర వికాసం కోసం క్రమ బద్దీకరణతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందన్నారు.చెంచులకు భూమి లేని వారికి భూమి కావాలని , మరికొన్ని సదుపాయాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.కె జోషి , డిజిపి మహేందర్ రెడ్డి , అజయ్ మిశ్రా , ట్రైబల్ వెల్ఫెర్ కమిషనర్ డా.క్రిస్టినా , NCST మెంబర్స్ హరిక్రిష్ణ దామోర్ , హర్షద్ భాయ్ చున్నీలాల్ వాసవ , మాయ చింతమన్ , NCST జాయింట్ సెక్రటరీ ఎస్.కె. రాతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -