బాలయ్య మృతి పట్ల బాల‌కృష్ణ సంతాపం..

97
nbk
- Advertisement -

టాలీవుడ్ నటుడు బాలయ్య (94) ఈరోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన యూసుఫ్ గూడ‌లోని త‌న స్వగృహంలో తెల్లవారుజామున క‌న్నుమూశాడు. బాలయ్య మృతి ప‌ట్ల హీరో నందమూరి బాల‌కృష్ణ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

బాల‌య్యగారి మ‌ర‌ణ‌వార్త తన‌ను క‌లచివేసిందని. ఆయన గొప్ప‌ న‌టుడ‌ని, త‌న తండ్రి ఎన్టీఆర్‌తో క‌లిసి ఆయన న‌టించారని బాల‌కృష్ణ పేర్కొన్నారు. త‌న సినిమాల్లో కూడా మంచి పాత్ర‌లు పోషించారని అన్నారు. మంచి న‌టుడు, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, క‌థా ర‌చ‌యిత‌గా బాల‌య్య ప్రతిభ‌ చూపారని చెప్పారు. బాల‌య్య‌తో త‌మ‌ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయ‌న నేడు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం ఎంతో దుర‌దృష్ట‌క‌రమ‌ని బాల‌కృష్ణ చెప్పారు. బాల‌య్య‌ ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. బాల‌య్య‌ కుటుంబ సభ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నానని పేర్కొన్నారు.

కాగా, బాల‌కృష్ణ న‌టించిన‌ ‘పాండురంగ‌డు’, ‘మిత్రుడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాల‌లో బాల‌య్య‌ న‌టించాడు. 1958లో వ‌చ్చిన ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో సినీరంగ ప్ర‌వేశం చేసిన బాల‌య్య‌ ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 300 సినిమాల్లో న‌టించాడు. ఈయ‌న మృతి ప‌ట్ల సినీప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

- Advertisement -