‘అన్‌స్టాపబుల్ 3’.. దబిడి దిబిడే అట

27
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన అన్‌స్టాప‌బుల్ షో ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో తెలిసిందే. ఆహా ఓటీటీ కోసం బాల‌య్య చేసిన ఈ టాక్ షోకు చాలా మంచి పేరొచ్చింది. ఈ షో రెండు సీజ‌న్లు పూర్తి చేసుకుని మూడవ సీజ‌న్ మొద‌లు కావ‌డానికి రెడీగా ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ‘ఆహా’లో అన్ స్టాపబుల్ సీజన్ 3కి బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుందని టాక్ వినబడుతోంది.

దీంతో ఈ షోకు సంబంధించి #NBKUnstoppable3 హ్యాష్‌ ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతేకాదు, ఈ సీజన్ తొలి ఎపిసోడ్ ఎవరితో ఉంటుందనే కామెంట్స్ మొదలయ్యాయి. దీనికి తొలి గెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి రానున్నట్లు నెటిజన్లు మేసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు మినిస్టర్ కేటీఆర్ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా అతిధి పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘అన్‌స్టాపబుల్ 3’.. ఈసారి దబిడి దిబిడే అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీల‌క పాత్ర పోషిస్తుంది. అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ ట్రైల‌ర్‌ను అక్టోబ‌ర్ 8న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Also Read:ఈ వారం బాక్సాఫీస్ కింగ్ అదొక్కటే

- Advertisement -