ఎన్టీఆర్‌ జయంతికి బాలయ్య మూవీ..

134
nbk
- Advertisement -

నట సింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 28న విడుదలచేయబోతున్నట్లు ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు బాలకృష్ణ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ “సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది.

ఈ నెల రెండో వారంలో ప్రారంభమయ్యే ఆఖరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. దివంగత నటుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమెరా: సి. రాంప్రసాద్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

- Advertisement -