దున్నపోతు మీద బాలయ్య

222
NBK Constituency Faces Water Crisis in Andhra
- Advertisement -

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు.  అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ… వింత నిరసనలకు దిగారు. బాలయ్యా.. కాస్త హిందూపూర్‌కి రావయ్యా..’ అంటూ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వేసవితాపంతో విలవిల్లాడుతున్నామనీ, మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేని కోరుతున్నారు. కొన్నాళ్ళుగా నియోజకవర్గానికి బాలయ్య వెళ్ళకపోవడంతో, కొందరు పోలీసుల్ని ఆశ్రయించారు కూడా.

NBK Constituency Faces Water Crisis in Andhra
తాగునీటి సమస్యను పరిష్కరించాలని, నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ… దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. అప్పటికీ శాంతించని ఆందోళనకారులు… గేదేలు, దున్నపోతులపై ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ పేర్లను రాసి నిరసన తెలిపారు. గతంలో బాలకృష్ణ కనబడటం లేదంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. తాజాగా దున్నపోతులపై పేర్లు రాసి నిరసన తెలుపడం చర్చనీయాంశంగా మారింది.

NBK Constituency Faces Water Crisis in Andhra
అంతేగాదు బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలోని డైలాగ్‌లను  రాసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ‘పదవి నాకు అలంకారం కాదు.. పదవికి నేనే అలంకారం..’ అని చెప్పుకునే బాలయ్య, ‘నేను మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడమే మీ అదృష్టం.. అంతకు మించి, ఇంకేమీ మీరు నా నుంచి ఆశించడం అనవసరం..’ అన్నట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాలయ్యా, ఇదేం రాజకీయమయ్యా.? అంటూ నిలదీస్తున్నారు.

- Advertisement -