కృష్ణకుమారి మృతికి బాలయ్య సంతాపం..

190
NBK Condolence to Krishna Kumari
- Advertisement -

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన “పిచ్చి పుల్లయ్య”(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్న సరసన కథానాయికగా నటించారు.

NBK Condolence to Krishna Kumari

“దేవాంతకుడు, బందిపోటు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం” లాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లోనూ నాన్న సరసన కృష్ణకుమారి నటించడం విశేషం. అటువంటి మేటి నటీమణి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకొంటున్నా.

- Advertisement -