వీరసింహారెడ్డిగా బాలయ్య!

49
nbk
- Advertisement -

అఖండ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ, క్రాక్ వంటి సక్సెస్‌ఫుల్ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో బాల‌య్య‌ 107వ సినిమాగా ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనుండగా, అందులో ఒక పాత్రలో ‘వీరసింహా రెడ్డి’గా కనిపించనున్నాడు. ఈ సినిమా టైటిల్‌ కు “వీరసింహా రెడ్డి” అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారట.

నవీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌, నవీన్ నూలీ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

- Advertisement -