కొండారెడ్డి బూరుజు వద్ద బాలయ్య!

125
nbk 107
- Advertisement -

అఖండ భారీ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా కర్నూల్ జిల్లాలో యాగంటి, కొమ్మెచెరువు, పూడిచర్ల, ఓర్వకల్లుతో పాటు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కర్నూలు సిటీకి షిప్ట్ చేశారు. సోమవారం నుంచి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ కీలకమైన సీన్స్ తీస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్.

ఇక షూటింగ్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బాలకృష్ణ కొత్త లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా రిలీజ్ చేశారు. రక్తం చిందిస్తోన్న పెద్ద కత్తి పట్టుకుని వైట్ అండ్ వైట్ కాస్టూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు బాలయ్య.

- Advertisement -