బాలయ్య బర్త్ డే ట్రీట్ రెడీ!

87
nbk
- Advertisement -

ఫ్యాన్స్‌కు తన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు బాలకృష్ణ. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా తన 107వ సినిమా అప్‌డేట్ ఇవ్వనున్నారు. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని టాక్. బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. పవర్‌ప్యాక్డ్ టీజర్ కట్‌ ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనుందట.

బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -