నాకేంటి సంబంధం అంటున్న నయన్‌..

318
Nayanthara Vasuki Movie Controversy
- Advertisement -

‘పుదియ నియమమ్’ అనే మలయాళ చిత్రంలో నయనతార నటించింది. ఆ సినిమాను ‘వాసుకి’ పేరుతో తమిళంలోకి అనువదించారు. నిన్న తమిళనాట ఆ చిత్రం విడుదలైంది. అయితే, కొత్త సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయించి కోలీవుడ్ లో బంద్ పాటిస్తున్నారు. ఇదే సమయంలో ‘వాసుకి’ విడుదల కావడంతో ఓ వర్గం నిర్మాతలు మండిపడ్డారు. నయనతారకు మాత్రం ఈ ప్రత్యేకత ఏమిటని ధ్వజమెత్తారు.

Nayanthara Vasuki Movie Controversy

అంతేకాదు, చెన్నైలోని నయనతార ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీచేశారు. దీనిపై నయనతార స్పందిస్తూ.. ‘ఈ సినిమా విడుదలకి, నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఆ సినిమాలో నటించిన కారణంగా నన్ను బాధ్యురాలిని చేయడం ఎక్కడి న్యాయం?’ అని ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం.

- Advertisement -