ఇటు సైరా…అటు ఐరా..!

222
nayanthara
- Advertisement -

నయనతార అటు గ్లామర్‌ పాత్రలతో ఇటు నటనకి అవకాశమున్న పాత్రలను ఎంచుకుంటు వరుస సినిమాలతో దూకుపోతుంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే నయన్‌ స్టార్‌ హీరోయిన్‌ స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది.

ప్రస్తుతం తెలుగు,తమిళ్‌లో వరుస సినిమాతో బిజీగా ఉంది నయన్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా సినిమాలో నటిస్తోంది. మరోవైపు కేజేఆర్ స్టూడియోస్ సంస్థ నిర్మాణంలో సర్జిన్ దర్శకత్వంలో ఐరా చిత్రంలో నటిస్తోంది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూట్. ఈ సినిమాలో నయన్ ద్విపాత్రాభినయం
చేస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోయిన్‌ నయనతార. ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఓ వైపు సినిమాల్లో నటిస్తునే ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన లవర్‌ విఘ్నేశ్ శివన్‌తో హాలీ డే టూర్‌ను ఎంజాయ్‌ చేస్తోంది నయన్‌.

- Advertisement -