నయన్ కోసం తీవ్ర పోటీ!

54
- Advertisement -

కోలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార యంగ్ హీరోయిన్స్ కి పోటీగా తయారైంది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ తర్వాత నయనతార క్రేజ్ బాగా పెరిగిపోయింది. కోలీవుడ్ లో ప్రస్తుతం నయనతార డిమాండ్ ఎక్కువయ్యింది. కోలీవుడ్ లో రజనీకాంత్, అజిత్ ఇలా పెద్ద స్టార్స్ అందరితో జోడి కడుతుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి నయనతార కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయనే న్యూస్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం నయనతార కున్న క్రేజ్ వలన ఆమెని టాలీవుడ్ సీనియర్ హీరోలు మళ్ళీ సంప్రదిస్తున్నారట. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఆమెను తెలుగు దర్శకనిర్మాతలు కొంత దూరం పెట్టారు.

కానీ, ప్రస్తుతం నయనతార టైమ్ నడుస్తోంది. అందులో భాగంగా బాలయ్య బాబు – దర్శకుడు బాబీ సినిమాలో మెయిన్ హీరోయిన్ కోసం నయనతారని సంప్రదించారని తెలుస్తోంది. నయనతార కూడా తన పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి ఈ ఆఫర్ ని ఒప్పుకుంది అనే టాక్ మొదలయ్యింది. మరి బాలయ్య సినిమాతో పాటుగా.. వెంకటేష్ నెక్స్ట్ మూవీ కోసం కూడా నయనతార ని అనుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్‌ మూవీతో సంక్రాంతికి రాబోతున్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్ చెయ్యబోయే చిత్రంలో నయనతార నే హీరోయిన్ అంటున్నారు.

అలాగే, మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ మూవీ విశ్వంభరలో కూడా నయనతార పేరు కూడా వినిపిస్తోంది. నయనతార కూడా ఈ సినిమా ఒప్పుకుంది అని టాక్. మరి నయనతార మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ ‘విశ్వంభర’ సినిమాకి డేట్స్ కేటాయించాల్సి ఉందట. జనవరి 21 నుండి విశ్వంభర సినిమా మరో షెడ్యుల్ మొదలు కానుంది. సంక్రాంతి పండుగ తర్వాత నయనతార షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం. మరి మెగాస్టార్ విశ్వంభర మూవీలో నయనతార పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద నయనతార కోసం టాలీవుడ్ పోటీ పడుతుంది.

Also Read: పుట్టగొడుగులు తింటున్నారా!

- Advertisement -