నయన్ -విఘ్నేశ్ శివన్క సరోగసి వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కోరగా నివేదికను సమర్పించించారు నయన్ దంపతులు. తన భర్త విగ్నేష్ శివన్ ను ఆరేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు సమకూర్చినట్లు తెలుస్తుంది. భారతీయ సరోగసి చట్టం ప్రకారం తల్లిదండ్రులు కావాలంటే పెళ్లి అయ్యి 5 ఏళ్ళు పూర్తీ కావాలి… దీంతో ఈ పద్దతిలోనే తామిద్దరం కవలలకు అమ్మానాన్నలు అయ్యినట్లు వెల్లడించారు.
పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపి అందరిని షాక్‌కు గురి చేశారు నయన్. దీంతో సరోగసి ద్వారా వీరు అమ్మనాన్నలు అయినట్లు వార్తలు రాగా వివాదంలో చిక్కుకున్నారు. ఎందుకంటే అద్దెగర్బంపై సుప్రీం గతంలోనే కీలక ఆదేశాలు జారీచేయగా ఒకవేళ వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలను కంటే ఐదేళ్ల జైలు శిక్ష ఖాయమనే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ వివరణ కోరగా అఫిడివిట్ ని ప్రభుత్వానికి అందజేశారు.