Toxic:టాక్సిక్‌లో ‘గంగా’గా నయన్‌

4
- Advertisement -

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’ నుంచి న్యూ ఇయర్ ఈవ్‌కు ముందుగా మరో కొత్త పోస్టర్ విడుదలైంది. ఇప్పటికే కియారా అద్వానీ, హుమా ఖురేషీ పాత్రల పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా నయనతార ఫస్ట్ లుక్‌ను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.

ఈ చిత్రంలో నయనతార ‘గంగా’ అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విడుదలైన పోస్టర్‌లో ఆమె బ్లాక్ కలర్ వన్-షోల్డర్ ఔట్‌ఫిట్‌లో, థై-హై స్లిట్‌తో స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ లుక్‌ను హై బూట్స్, భారీ గోల్డ్ బ్రేస్‌లెట్ మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఆమె పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందన్నదానిపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘టాక్సిక్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. గీతు మోహందాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 19న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్

- Advertisement -