మునుపటి నయనతార కనిపిస్తోందట

33
- Advertisement -

నయనతార ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉందనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఆమె చాలా కాలంగా తన పిల్లలతో బిజీగా ఉన్న విషయం కూడా మనకి తెలుసు. ఆ కారణంగానే ఆమె సినిమాల్లో ఎక్కువ నటించడం లేదు. కొన్నాళ్లు సినిమా షూటింగ్ ల నుంచి బ్రేక్ కావాలంటూ ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఐతే, సినిమాలు తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న వైనమూ కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నయనతార ఓ సినిమా ఒప్పుకుంది. తన భర్త దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ఆమె ఓ అక్క పాత్రలో నటిస్తోంది.

ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. ‘‘నేను సినిమాలు తగ్గించాను. కానీ నన్ను నా ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. వాళ్ళు నన్ను లేడీ అమితాబ్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వండి అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. దయచేసి నన్ను అలా అనకండి.. చెబితే తిడతారు. మళ్లీ నాపై విమర్శలు మొదలెడతారు. ఏది ఏమైనా నేను మీ కోసం అన్నపూరణి సినిమా చేస్తున్నా. ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు నాకు ఇష్టం వచ్చినట్లే జరిగాయి. అందుకే ఈ సినిమా చేస్తున్నా అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

అన్నట్టు అటు నిర్మాతగా కూడా నయనతార ఫుల్ బిజీ కావాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాలు నిర్మించబోతుంది. మొత్తానికి తాజాగా నయనతార చేసిన రచ్చ చూస్తుంటే ఒకప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండేవారో అలా కనిపించడం విశేషం. నయనతార ఎనర్జీ చూస్తుంటే ఆమె ఇప్పుడు ఇంకా అందంగా చాలా బాగున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఆమె అనేక టూర్లు కూడా చేస్తున్నారు. సో, నయనతార త్వరలోనే మళ్ళీ సినిమాల్లో ఫుల్ యాక్టివ్ గా నటించే అవకాశం ఉంది. దీంతో నెటిజన్లు మునపటి నయనతార కనిపిస్తోందది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:‘హద్దు లేదురా’.. ఫస్ట్ లుక్

- Advertisement -