పవన్ కళ్యాణ్ “పింక్” మూవీలో లేడీ సూపర్ స్టార్

360
Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి మూవీ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈవిషయాన్ని ఓ బాలీవుడ్ నిర్మాత స్వయంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోయినా ఇండస్ట్రీ వర్గాలు మాత్రం నిజమేనంటున్నాయి.

బాలీవుడ్ లో ఘన విజయాన్ని సాధించిన పింక్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్నారు. ఈమూవీని బాలీవుడ్ అగ్రనిర్మాత బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఈమూవీకి వేణు శ్రీ రామ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

అయితే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ఈమూవీ పనిలో బిజీగా ఉన్నారట. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈమూవీలో పవన్ కళ్యాణ్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారని తెలుస్తుంది. ఇటివలే చిత్రయూనిట్ ఆమె సంప్రదించడంతో నయనతార కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభంకానుందని సమాచారం.

- Advertisement -