వీరికి పెళ్లైంది కానీ.. సహజీవనమేనట !

210
nayanatara-married-already
nayanatara-married-already
- Advertisement -

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతోంది న‌య‌న‌తార‌ దాదాపుగా ఏడెనిదేళ్ల నుంచి శింబు, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. ఎక్కడికి వెళ్లినా.. ఆఖరికి విదేశాల్లో జరిగే అవార్డు ఫంక్షన్స్ కు వెళ్లినపుడు కూడా విఘ్నేష్ ను వెంట తీసుకెళ్లిపోవడం.. అక్కడ నయన్ చూసి ఈ దర్శకుడు మురిసిపోవడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి.

Nayanthara-Vignesh-Shivan-03

ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా… తన కొత్త ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో గడపడానికి చాలా సమయం కేటాయిస్తోంది. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ యంగ్ డైరెక్టర్‌తో నయన్ ప్రేమ మొదలైంది. ఏదైనా అనుకోని ఘటన జరగితే తప్పా.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇదంతా కొత్త పెళ్లి జంటగా పడుతున్న పాట్లు అనే టాక్ మొదలైపోయింది.

1467710100_south-indian-actress-nayanatara-hugs-vignesh-sivan-receives-siima-awards

నయనతార విఘ్నేశ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, తన కెరీర్, మీడియా నుంచి దూరంగా ఉండడానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిందని ఫిల్మ్ వర్గాల సమాచారం. మే నెలలోనే.. అంటే ఆరు నెలల ముందే విఘ్నేష్ శివన్ తో నయనతారకు పెళ్లి జరిగిపోయిందని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ భార్యాభర్తలే అని కోలీవుడ్ కోడై కూస్తోంది. ప్రేమ వ్యవహారం పాకాన పడగానే.. పెళ్లి పీటలు ఎక్కేశారట. గతంలో రెండు సార్లు లవ్ స్టోరీలు ఫెయిల్ అయిన అనుభవం ఉన్న నయన్.. ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. పెళ్లి తంతు ఫినిష్ చేసేసిందని అంటున్నారు. ఇందుకోసమే తను నటించిన సినిమాల ప్రమోషన్లకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటోందని కూడా కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఇలా కొంతకాలం పాటు ఇలా సహజీవనం చేస్తున్నట్లుగానే నటించి మంచి సమయం చూసి ప్రకటించాలనేది ఈ జంట ప్లాన్ అట.

- Advertisement -