శశిరేఖగా నయన్!

8
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో న‌య‌న్ శ‌శిరేఖ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో న‌య‌న్ ప‌సుపు రంగు చీర‌లో మెరిసిపోతుంది.

షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -