యాక్షన్‌.. ఎమోషన్‌తో ‘నవాబ్’ ట్రైలర్..

249
- Advertisement -

సంచాలనల దర్శకుడు మణి రత్నం దర్శకత్వంలో తమిళంలో ‘చెక్క చీవంత వాణం’. తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్ ‌స్వామి, అరుణ్‌ విజయ్‌, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్‌, అదితి రావ్‌ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Nawab Moive Official Trailer 2

తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. యాక్షన్‌కి .. ఎమోషన్‌కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. సహజత్వానికి దగ్గరగా మలచిన సన్నివేశాలు మనసుకు పట్టుకునేలా వున్నాయి.

- Advertisement -