ఉద్యోగం కావాల‌ని హీరో ట్వీట్… స్పందించిన ఎవోక్

67
naveen

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారిన నటుడు నవీన్ పోలిశెట్టి. తర్వాత జాతిరత్నాలుతో మెప్పించిన నవీన్…తాజాగా ఉద్యోగం కావాలని చేసిన ట్వీట్‌కు ఎవోక్ స్పందించింది. కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగం కొల్పోగా స‌మీర్ అనే ఉద్యోగి క‌రోనా కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడ‌ని, ఎవ‌రైన ఆయ‌న‌కు సాయం చేయండ‌ని చరణ్, సౌమ్య అనే ఇద్దరు నెటిజన్లు వేడుకున్నారు. ఈ ట్వీట్ నవీన్ పోలిశెట్టి దృష్టికి రావడంతో సాయం చేయాలని వివరాలతో ట్విట్టర్‌ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

న‌వీన్ పోలిశెట్టి ట్వీట్‌కి ఎవోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ స్పందించింది. సమీర్‌ని స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగం కల్పించింది. స‌మీర్ త‌న ఆఫ‌ర్ లెట‌ర్‌ని షేర్ చేస్తూ న‌వీన్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. నవీన్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.