ఒడిశాలో రైతుబంధు…

230
naveen patnaik
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రైతు బంధు,రైతు భీమాతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్‌ సర్కార్‌ బాటలోనే నడిచేందుకు మిగితా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తికనబరుస్తున్నాయి.

ముఖ్యంగా ‘రైతు బంధు’ పథకం తరహాలోనే ఒడిశా, జార్ఖండ్ లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలను తీసుకువచ్చాయి. అన్నదాతకు పెట్టుబడి సాయమందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఒడిశాలో ‘కృషక్‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్‌ లైవ్లీవుడ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఇంకమ్‌ అగ్‌మెంటేషన్‌ (కాలియా)’ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం రూ. 10వేల కోట్లు కేటాయించారు.

సీఎం నవీన్‌ పట్నా యక్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షత జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఖరీఫ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌లో రూ. 5వేలు, రబీ సీజన్‌లో రూ. 5వేలు చొప్పున ప్రతీ ఏటా రూ. 10 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. కౌలు రైతులు, కూలీలు కూడా దీని పరిధిలోకి వస్తారని తెలిపారు. కాలియా పథకం ద్వారా 92శాతం మంది అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తుందని ఒడిశా సీఎం‌‌‌‌‌‌‌ చెప్పారు.

జార్ఖండ్‌ సర్కార్‌ సైతం రైతు బంధు తరహాలోనే పథకాన్ని ప్రకటించింది. ఎకరాకు రూ. 5వేల చొప్పున రైతులకు అందించాలని నిర్ణయించిన రఘుబర్ దాస్ సర్కార్‌ ఇందుకోసం ఐదు ఎకరాల వరకు పరిమితి పెట్టుకుంది. ఎకరా లోపు భూమి ఉన్న రైతుకు కూడా రూ. 5వేలు అందజేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కృషి యోజన పథకం ద్వారా రూ. 2250 కోట్లు కేటాయిస్తామనిఆయన ప్రకటించారు.

- Advertisement -