‘మట్కా’ ..సాహుగా నవీన్ చంద్ర

1
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ రిలీజ్ కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ లే లే రాజా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఈ మూవీలో నవీన్ చంద్ర ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నవీన్ చంద్ర క్యారెక్టర్ ని సాహు గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర స్కూటర్ పై కూర్చుని ఇంటెన్స్ గా చూస్తున్న పోస్టర్ క్యురియాసిటీని క్రియేట్ చేసింది.

మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.మట్కా నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:‘దానా’ తుపాను… ఏపీలో మళ్లీ వర్షాలు

- Advertisement -