బీబీ3లో నవీన్ చంద్ర..!

476
naveen chandra
- Advertisement -

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌ అంటే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. గ‌తంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా,లెజెండ్ ఘన విజయం సాధించాయి. ఇక లెజెండ్ సినిమాకు నంది అవార్డుల పంటపండింది.

తాజాగా మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంచనాలతో పాటు రోజుకో వార్త టీ టన్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దర్శకుడు బోయపాటి. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఒకరు కొత్తవారిని తీసుకోబోతున్నామని తెలిపారు.

ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మొత్తంగా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు బాలయ్య.

- Advertisement -