మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల హెల్త్ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే మనకు పోషకాహార లోపంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సరైన పోషకాలు ఉన్న పదార్థాలను తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయి. ఇక ముఖ్యంగా మరి సీజనల్‌గా వచ్చే వ్యాధులతో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
పొరపాటుగా రోగాల బారిన పడ్డామంటే శరీరానికి యాంటి బయోటిక్స్,పెన్‌కిల్లర్ ట్యాబ్లెట్స్ తప్పనిసరి. వ్యాధి తీవ్రతను బట్టి యాంటిబయోటిక్స్ ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. వీటితో భవిష్యత్‌లో శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ నేపథ్యంలో నేచురల్‌గా లభించే యాంటిబయోటిక్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..పుసుపు, అల్లం,అరిగానో ఆయిల్,ఉల్లిపాయలు,హర్స్ రాడిష్ రూట్,ఎకినేషియా,యాపిల్ వెనిగర్,ముడి తెనే,వెల్లుల్లి,కొలైడల్ సిల్వర్ వంటివి నేచురల్ యాంటిబయోటిక్‌గా ఉపయోగపడాయి.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..