నాని కీలకపాత్రలో …’అ..!’

198
Natural Star Nani Poster in #AWE
- Advertisement -

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని. ప్రస్తుతం ఎంసీఏ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న నాని..నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై అ..!సినిమాను నిర్మిస్తున్నాడు. నిత్యామేనన్‌, కాజల్‌, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Natural Star Nani Poster in #AWE
ప్రశాంతవర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని ఓ చేపకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. తాజాగా ‘అ!’ చిత్రంలో కనిపించనున్న చేప ఫొటోను అభిమానులతో నాని షేర్‌ చేసుకున్నారు ‘పరోపకారం చేసే చేపగా ‘అ!’లో నేచురల్‌స్టార్‌ నాని’ అనే పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘నా తర్వాతి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయటంతో ఈదడం నేర్చుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.

  Natural Star Nani Poster in #AWE
‘అ!’ చిత్రంలో చేపతో పాటు మరో ప్రాణి కూడా ఇందులో కనిపించనుంది. దానికి రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -