‘జెర్సీ’ నాని ఫ‌స్ట్ లుక్….

266
jersey
- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈసినిమా షూటింగ్ స‌గం వ‌ర‌కూ పూర్తైంద‌ని స‌మాచారం. క్రికెట్ నేప‌థ్యంలో ఈమూవీ సాగ‌నుంది. అర్జున్ అనే క్రికెట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్నాడు. మ‌ళ్ళీరావా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాని స‌ర‌స‌న క‌థానాయిక‌గా శ్ర‌ధ్దా శ్రీనాథ్ క‌నిపించ‌నుంది.

jersey

త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ఈమూవీకి సంగీతం అందిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈచిత్రం ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. క్రికెట‌ర్ లుక్ లో నాని ఆక‌ట్టుకుంటున్నాడు. నానికి కొంత కాలంగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొడ‌తాన‌నే న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఈమూవీ త‌ర్వాత ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ తో సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం.

- Advertisement -