డ్రగ్స్ నిర్మూలనకు నాని సపోర్ట్..

214
Nani
- Advertisement -

ఈ రోజు (జూన్ 26న) అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం. మత్తు పదార్ధాల ఉపయోగం వల్ల దుష్ఫలితాలు తెలిపి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఏర్పాటు ముఖ్యఉద్దేశ్యం. ఈ సందర్భంగా డ్రగ్స్ సేవించడం ఎంత హానికరమో, దాని వల్ల మన జీవితాలు ఏ విధంగా మారతాయో ప్రజల్లో అవగాహన కల్పించేకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చిన్న ప్రయత్నం చేసింది. నేచురల్ స్టార్ నానితో కలిసి ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నాని ఒక మంచి మెసేజ్‌ను యువతకు ఇచ్చారు.

‘‘మీరు లైఫ్‌లో చాలా ఎత్తుకు ఎదిగితే చూడాలని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టూ ఉన్న సొసైటీలో చాలా మంది ఎదురుచూస్తారు. అదే మీరు ఎదగకుండా పాతాళానికి పడిపోతే చూడాలని ఒకడు ఎదురు చూస్తుంటాడు. అదే డ్రగ్స్.. ఆ డ్రగ్స్ వైపు మీరు వేసే ఒకే ఒక్క తప్పటడుగు మీ లైఫ్ మీద మీకున్న కంట్రోల్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. మిమ్మల్ని డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి మీ నుంచి డబ్బులు సంపాదించాలనుకునే మాఫియాలు, బ్లాక్ మార్కెట్‌లు చాలానే ఉన్నాయి.

అవన్నీ ఒకవైపు.. వాటిన్నిటినుంచీ మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతోన్న వేలాది మంది పోలీసులు ఒకవైపు. మీరేవైపు. వాళ్లు చీకటితో చేస్తోన్న యుద్ధంలో మనం కూడా పాలు పంచుకుందాం. వాళ్లకు కొంచెం సహాయం చేద్దాం. మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే, పోనీ మీ స్నేహితుల దగ్గర ఉంటే, మీకేమైనా తెలిస్తే పోలీసులకు తెలియజేయండి. మీ పేరు కూడా వాళ్లు బయటకి రానివ్వరు. ఈ చీకటిపై కలిసి పోరాడుదాం’’జైహింద్‌.. అని హీరో నాని పేర్కొన్నారు.

- Advertisement -