NANI:మీరంతా నా గుండెల్లో ఉంటారు

50
- Advertisement -

తెలంగాణ నేపథ్యం ఉన్న బలగం సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్‌లు రాబట్టిన సినిమాపై టాలీవుడ్‌ నాచురల్ స్టార్ నాని సంచలన కామెంట్స్‌ చేశారు.

బలగం ఎంత బాగుందో అని అన్నారు. ఇలాంటి సినిమానే కదా ఇన్ని రోజుల నుంచి తెలుగు పరిశ్రమ కోరుకుంటోంది. ఈ సినిమాలోని నటీనటులంతా వాళ్ల పాత్రల్లో జీవించేశారు. ఇంత మంచి క్లాసిక్‌ను అందించిన మీరంతా ఎప్పటికీ నాగుండెల్లో ఉంటారు. అంటూ దర్శకనిర్మాతలకు నటీనటులకు అభినందనలు ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే అటు ట్వీట్ వైరలవుతుండగా..అభిమానులంతా ఆయన తర్వాత సినిమా వివరాలు చెప్పమని సోషల్‌మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కనీసం టైటిల్‌ అయినా ప్రకటించాలని కోరుతున్నారు.

Also Read: మెగా వారసురాలిని చూశారా..?

నాని ప్రస్తుతం దసరా తర్వాత nani30సినిమాల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌ 21వ ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలిపారు. సౌరవ్‌ అనే కొత్త దర్శకుడు పరిచయమవ్వగా… సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ నానికి జోడిగా నటిస్తోంది. దీని తర్వాత నాని వివేక్‌ ఆత్రేయతో సినిమా చేయనున్నట్టు టాలీవుడ్‌లో టాక్‌.

Also Read: పిక్ టాక్ : ఉబికి వస్తున్న పరువాలు

- Advertisement -