ఘనంగా నాటోమాస్‌ కల్చరల్ మహోత్సవం..

230
NATOMAS CULTURAL EXTRAVAGANZA-2016
- Advertisement -

అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌ల సంఘం (నాటోమాస్‌) ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా కల్చరల్ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ రెజినా కసాండ్రా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్చరల్ ఈవెంట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఈ సందర్బంగా పలువురు అడిగిన ప్రశ్నలకు రెజీనా సమాధానం తెలిపారు. రెజీనాతో పాటు సినీ నటి కవిత,గాయకులు రేవంత్,దామిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్,దామిని సభికులను పాటలతో ఉర్రూతలూగించారు.

రేవంత్,దామిని పాడుతున్న సమయంలో జనం చప్పట్లతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. కల్చరల్ ఈవెంట్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి లాస్య యాంకర్‌ హైలెట్‌గా నిలిచింది. తనదైన యాంకరింగ్‌తో పాటు డ్యాన్స్‌ చేస్తూ అలరించింది. ఈ సందర్భంగా ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌లో కీల‌క భూమిక పోషించిన వెంక‌ట్ మేచినేని మాట్లాడుతూ నాటోమాస్ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారంతోనే ఘ‌నంగా నిర్వ‌హించ‌డం సాధ్య‌ప‌డింద‌న్నారు.

కార్యక్రమానికి పిలవగానే వచ్చిన హీరోయిన్ రెజీనా,రేవంత్,దామిని,లాస్య, నటి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కల్చరల్ ఈవెంట్ విజయవంతం కావటంలో కీలకభూమిక పోషించిన ప్రతిఒక్కరికి…మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలుగు వారు పాల్గొన్నారు.

 NATOMAS CULTURAL EXTRAVAGANZA-2016

తెలంగాణ సంప్ర‌దాయ పండుగ బ‌తుక‌మ్మ పండుగ‌ను సైతం నాటోమాస్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా. తెలంగాణ సంప్ర‌దాయాన్ని ప్ర‌తిబింభిస్తూ వేడుక‌లు అంగరంగ వైభవంగా జ‌రిగాయి.

https://youtu.be/X4UHR9IsqE4

- Advertisement -