యూట్యూబ్ లో ఏదైనా వీడియో నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో యాప్‌ల ద్వారా ఇప్పటివరకు షేర్ చేసేవారు.. తాజాగా ఇకపై వేరే యాప్స్ అవసరం లేకుండానే యూట్యూబ్‌లో నచ్చిన వీడియోలను యూట్యూబ్ ద్వారానే స్నేహితులకు పంపించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సోమవారం నుంచి ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకొని స్నేహితులతో వీడియోలు షేర్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త షేరింగ్ ఫీచర్‌తో వీడియోలు పంచుకోవడమే కాదు ‘ఈ వీడియో నువ్వు చూశావా?’ అంటూ చాటింగ్ కూడా చేసుకోవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారిలో ఒకేసారి అత్యధికంగా 30 మందికి వీడియోలను, మెసేజ్‌లను పంపించుకోవచ్చు.ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది నుంచే దీన్ని పరిశీలిస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేశామని యూట్యూబ్ పేర్కొంది.