- Advertisement -
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మానవ నాగరికత ప్రగతిలో చేనేతకు విశిష్టమైన స్థానం ఉందని, చేనేత పునరుజ్జీవం కోసం, చేనేత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని సందేశం ఇచ్చారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున 3 మంది చేనేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు అందించనుంది ప్రభుత్వం. పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించనున్నారు మంత్రి తుమ్మల.
Also Read:ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
- Advertisement -

