వర్క్ వీసాల రద్దు…అమెరికాకే నష్టం

212
nasscom
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌1బీతోపాటు ఇతర వర్క్ వీసాలపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధించారు. కరోనాతో అమెరికాలో నిరుద్యోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో వేల మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుండగా ఐటీ కంపెనీలు సైతం పెదవి విరుస్తున్నాయి.

వర్క్‌ వీసాల జారీని రద్దు చేయడం తప్పుడు నిర్ణయమని నాస్కామ్‌ అభిప్రాయపడింది. వ‌ర్క్ వీసాల ర‌ద్దుపై అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమై ఆ దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని పేర్కొంది.

అమెరికన్లలో అవ‌స‌రానికి స‌రిప‌డా నిపుణులు లేక‌పోవ‌డంతో అక్కడి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశమున్నదని నాస్కామ్‌ అభిప్రాయపడింది.

- Advertisement -