Nargis Dutt: బర్త్ డే స్పెషల్

67
- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి నర్గీస్ దత్. తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన నర్గీస్..అనేక కమర్షియల్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆమె నటించిన మదర్ ఇండియా చిత్రం అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. ఇక ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్. అలహాబాదుకు చెందిన ముస్లిం-గాయని జద్దన్ బాయి, తండ్రి హిందువు మోహ్‌యాల్ రావల్పిండికి చెందినవారు. నర్గిస్ అన్న అన్వర్ హుసేన్, హిందీ నటుడు. చిన్నతనంలోనే కెరీర్‌ని ప్రారంభించింది. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో నటించింది. బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా (1951), దీదార్ (1951), శ్రీ 420 (1955), చోరీ చోరీ (1956) హిట్ చిత్రాలు. చాలా సినిమాలు రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సరసన నటించినవే.

Also Read:Rajinikanth:వెనక్కి తగ్గేదిలేదు

మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా (1957). ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్ సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం 1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి బహుమతి తెచ్చి పెట్టింది.

Also Read:ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

నర్గీస్ కుమారుడే సంజయ్ దత్. బాలీవుడ్‌లో తనకంటూ సత్తాచాటాగా ఆమె కుతురు ప్రియా దత్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. సునీల్ దత్ -నర్గిస్ జ్ఞాపకార్ధం The Nargis Dutt Memorial Cancer Foundation ను ప్రారంభించారు. 1980 లో నర్గిస్ కు pancreatic కాన్సర్ ఉందని తేలగా న్యూయార్క్ లోని ఆసుపత్రి లో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత 2 మే 1981 సంవత్సరంలో నర్గిస్ కోమా లోకి వెళ్ళగా 3 మే 1981 రోజున మరణించారు.

- Advertisement -