- Advertisement -
హైదరాబాద్ నగరంలో రోడ్ల పైన నిస్సహాయ స్థితిలో ఎముకలు కొరికే చలిలో పడుకున్న అభాగ్యులకు నరేన్ ఫౌండేషన్ చేయూత ఇచ్చింది. పని కోసం పట్నం వచ్చిన వారికి, భిక్షాటనతో జీవనం సాగించే వారికి ఇల్లు లేక ఫూట్ పాత్ లనే ఇల్లుగా మార్చుకుని నిద్రిస్తున్నవారికి నరేన్ ఫౌండేషన్ సభ్యులు చలి నుండి కొంత సేద తీర్చేందుకు దుప్పట్ల పంపిణి చేయడం జరిగింది.
నగరంలో అమీర్ పేట, బసవతారకం ఆసుపత్రి, జూబ్లీ చెక్ పోస్ట్, నిమ్స్ ఆసుపత్రి, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, RTC క్రాస్ రోడ్, గాంధీ ఆస్పత్రి, సికింద్రాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో రాత్రి 12 గంటల సమయంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
- Advertisement -