మోడీ 3.0లో నలుగురికి ప్రమోషన్

248
Narendra Modi cabinet 3.0
Narendra Modi cabinet 3.0
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నలుగురికి ప్రమోషన్ ఇవ్వగా, 9 కొత్త ముఖాలను కేబినెట్ లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో కొత్త మంత్రులతో కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఇందులో కేబినెట్ హోదాను నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ కు కల్పించారు. సహాయ మంత్రులుగా శివ్ ప్రతాప్ శుక్లా, అశ్వినీ కుమార్ చౌబే, డాక్టర్ వీరేంద్ర కుమార్, అనంత్ కుమార్ హెగ్డే, సత్యపాల్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అల్పాన్స్ కన్వంధనమ్, హర్దీప్ సింగ్ పూరీ, రాజ్ కుమార్ సింగ్ లకు కేబినెట్ లో స్థానం కల్పించారు.

cabinet

వచ్చే ఎన్నికల నేపథ్యంలోనే ఈ విస్తరణ జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  సాధారణ ఎన్నికలకు మరో 21 నెలలు సమయమే మిగిలి ఉండటం, వచ్చే ఏడాది లోపల కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చేపడుతున్న కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ప్రభుత్వాధినేతగా తన జట్టు అన్ని విధాలా అత్యుత్తమంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. పనితీరు సంతృప్తికరంగాలేని మంత్రులను నిర్మొహమాటంగా రాజీనామా చేయాలని సూచించటం దీనిలో భాగమేనని అంటున్నారు.

Probables

అప్పట్లో యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకొని కొందరికి మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా వచ్చే ఏడాది లోపల గుజరాత్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు… ఇక మిగిలిన సమయంలో మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు కనుక వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ, అధికార పార్టీ అధ్యక్షునిగా అమిత్‌షా ప్రస్తుత పునర్వ్యస్థీకరణపై భారీ కసరత్తు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం మోదీ మంత్రి మండలిలో 73 మంత్రులు ఉన్నారు. వీరిలో ఏడుగురు రాజీనామాలు సమర్పించారు. వీరందరి రాజీనామాలను ప్రధాని ఆమోదిస్తే మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు చేరుతుంది. కేబినెట్‌లో గరిష్ఠంగా 81 మందికే అవకాశం ఉంది కనుక కొత్తగా 15 మందిని చేర్చుకునే వీలుంది. ప్రస్తుతానికి తొమ్మిదిమందికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

- Advertisement -