ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు మృతి

206
Narayana’s son killed in accident
- Advertisement -

ఏపీ మంత్రి నారాయ‌ణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నారాచయ‌ణ కుమారుడు నిషిత్ నారాయ‌ణ‌,అత‌ని స్నేహితుడు ర‌వివ‌ర్మ మృతి చెందారు. జూబ్లి హిల్స్ రోడ్ నెంబ‌ర్ 36లో మెట్రో పిల్ల‌ర్ ను ఢీకొట్టి ధ్వంస‌మైంది. కారు నెంబ‌ర్ టీఎస్ 07 ఎస్‌కే 7117. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Narayana’s son killed in accident

కారు ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అపోలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కొల్పోయిన‌ట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కారును తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిశిత్‌ ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్ర‌మాద విషయాన్ని తెలుసుకున్న‌ తెలంగాణ మంత్రి హరీష్ రావు, నామా నాగేశ్వరరావు అపోలో ఆసుపత్రికి చేరుకుని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ప్రమాదం జరిగిన సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం అపోలోకు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కూడా అపోలోలో నిషిత్ నారాయణ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నారాయణ నివాసానికి చేర్చే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా నుంచి సంతాపం ప్రకటించారు. నిషిత్ నారాయణ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మంత్రి నారాయణకు తన సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు.

Narayana’s son killed in accident Narayana’s son killed in accident Narayana’s son killed in accident

- Advertisement -