డిజిటల్‌ బాబు ఇలాఖాలో…నో బ్యాంక్‌…నో ఏటీఎం

246
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోట్ల రద్దు గురించి స్వయంగా తానే నరేంద్రమోడీకి లేఖ రాసి పెద్దనోట్లు రద్దు చేయించాను అని సందర్భం దొరికినప్పుడల్ల చెబుతుంటాడు. హైదరాబాద్‌ డెవల్‌ప్‌మెంట్‌ అయ్యింది నా వల్లే హైటెక్‌ సిటీ కట్టింది నేనే అసలు టెక్నాలజీకి పురుడు పోసింది తానే అని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాబు అంటే టెక్నాలజీ…టెక్నాలజీ అంటే చంద్రబాబు అనేల ప్రచారం చేసుకున్నారు ఏపీ సీఎం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని కూడా ప్రపంచంలోని నెంబర్‌వన్‌గా నిలుపుతానని చెబుతున్నాడు. ఇలా మాయమాటలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని ఏపీ ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపిస్తున్నాయి.

 Naravaripalle village,there's no ATM

అయితే నోట్ల రద్దు తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చిల్లర లేక రెండు వేల రూపాయిలకు చిల్లర దొరక్క చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు…. దీంతో ప్రభుత్వాలు ఈవ్యాలెట్‌, ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రజలకు అవగహాన కల్పిస్తున్నారు. అయితే చంద్రబాబు గారి సొంత ఊరు అయిన నారావారిపల్లెలో ఏటీఎం, బ్యాంకు గానీ లేవట….ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న సుమారు పన్నెండు గ్రామల్లోను ఇదే పరిస్థితి ఉందట. ఏటీఎం కోసం, బ్యాంకులో మనీ విత్‌డ్రా చేసుకోవడం కోసం దాదాపు 10కి.మీ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

ఇక నారావారి పల్లెలో స్వైపింగ్‌ మిషన్లు కూడా లేవట…ఆ ఊరిలో ఒక రేషన్‌ డీలర్‌ దగ్గర మాత్రమే ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ఉందని చెబుతున్నారు నారావారి గ్రామస్తులు. ఈగ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో రంగంపేట అనే ఊర్లో ఏటీఎం ఉన్న అది పనిచేయడంలేదట…ఆ ఏటీఎం గురించి బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన వినివినపడనట్లుగా ప్రవర్తిస్తున్నారట.

 Naravaripalle village,there's no ATM

దేశంలో నోట్ల రద్దు శుభపరిమాణామే అని, ప్రజలు డిజిటల్‌ లావాదేవీల వైపు మొగ్గుచూపులని, అవినీతి అంతం కావలంటే ఆన్‌లైన్ల్‌ చెల్లింపుల ద్వారా సౌధ్యమని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోను చెబుతుంటారు. నారావారిపల్లె అంటే చంద్రబాబు గారి సొంత ఊర్లో ఏటీఎంలు,బ్యాంక్‌లు స్వైపింగ్‌ మిషన్లు లేకపోవడంపై ఆ గ్రామ ప్రజలు ఒక్కింత అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రతిపక్షపార్టీ నేతలు బాబుపై మండిపడుతున్నారు. చంద్రబాబు తన సొంత గ్రామం లోని దుస్థితిని పట్టించుకోవడంలేదనే రాష్ట్రాన్ని ఏవిధంగా బాగు చేస్తాడని… హైటెక్‌ బాబుగా డబ్బ కొట్టుకునే సీఎం తన గ్రామంలో మాత్రం హైటెక్‌ విధానాన్ని ఆమలు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.

- Advertisement -