- Advertisement -
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో నరసింహన్ కాసేపు మాట్లాడారు.
ఫామ్ హౌస్‌లో వాష్‌రూమ్‌లో జారిపడి కేసీఆర్ తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు సర్జరీ జరుగగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
గవర్నర్‌గా నరసింహన్ దాదాపు పదేళ్ల కాలం పాటు పనిచేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు నరసింహన్.
Also Read:‘సైంధవ్’లో యూనిక్ క్యారెక్టర్ చేశాను:నవాజుద్దీన్
- Advertisement -

