నారప్ప..శివరాత్రి స్పెషల్

257
narappa
- Advertisement -

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినం సంద‌ర్భంగా ‘నారప్ప’ మూవీ నుండి మ‌రో లుక్ విడుద‌ల చేశారు. ఇందులో వెంకటేష్ యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన నారప్ప పోస్టర్లతో చూస్తే.. తాజాగా విడుదలైన పోస్టర్ మరింతగా ఆకట్టుకుంటుంది.

సమాజంలోని అసమానతలు, కులస్థులకు మధ్య గొడవలు, చదువు ప్రాముఖ్యతను తెలిపే ఒక పీరియాడికల్‌ డ్రామాగా ఈ సినిమా రానుంది. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 14న విడుదల కాబోతుంది.

- Advertisement -