‘నారప్ప’ సెన్సార్ పూర్తి..

228
Narappa
- Advertisement -

టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘నారప్ప’ సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా చేసిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీని తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. సురేశ్ బాబు .. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి నటించగా, ప్రకాష్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అసలు ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు.

తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌
కథ: వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్ పండీ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌

- Advertisement -