యువ దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నారా రోహిత్, రెజీనా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం శంకర. ఈ మూవీ ఈ నెల 21న విడదల కాబోతుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మౌనగురు’ సినిమాకి ఇది రీమేక్, హిందీలో’ అఖిర’ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించి, భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి ఎ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. సోనాక్షి సిన్హా ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. తమిళం, హింది ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది, దీని ఇప్పుడు తెలుగులో ‘శంకర ‘అనే పేరుతో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా పై భారీ అంచనలు వ్యక్తం అవుతున్నాయి
ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో కొన్ని విషయాలను వెల్లడించారు. ఇందులో నారా రోహిత్ స్టూడెంట్ గా కనిపిస్తాడని… విలన్ గా’ కబాలి ‘ జాన్ విజయ్ నటించాడని తెలిపాడు. ఈ సినిమా సెకండ్ ఆఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగుంటాయని…స్టూడెంట్‌గా నారా రోహిత్ అద్భుతంగా నటించాడని ముఖ్యంగా తను ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను ఆటకట్టించే విధానం ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన తెలిపారు. హీరోయిన్ రెజీనా పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉండనుందన్నారు.
ఈ సినిమా ఆలస్యం కావడం కొంత నిరాశ పరిచింది అని దర్శకుడు తాతినేని సత్య ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాని ఇప్పుడున్న నిర్మాతలు చాల టైం తీసుకుని
సినిమాలను చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈసినిమా ద్వారా నాకు ముందు ముందు చాలా మంచి ఆఫర్స్ వస్తాయిఅని ఆయన తెలిపారు. మా తాత- నాన్న గారు దాదాపు వందకు పైగా సినిమాలు తీసారు అని ఆయన గుర్తు చేశారు. ఈ సినిమా చేస్తున్న గ్యాప్‌లో సచిన్ జోషిత్ సినిమా కూడా చేశాను అని ఆయన గుర్తుచేశారు.
ఈ శంకర చిత్రం తర్వత మరిన్ని సినిమాలు తీయడంలో వేగం పెంచుతాను అని దర్శకుడు తాతినేని సత్య తెలిపారు.
ఈ సినిమా తప్పకుండా హీరో నారా రోహిత్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుందని ఆయన తెలిపారు
గతంలో కబడీ జట్టు… ఎస్.ఎం. ఎస్ సినిమాలతో దర్శకుడు తానినేని సత్య టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.