నారా రోహిత్..’సుందరకాండ’

8
- Advertisement -

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజైన టీజర్‌ హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. లియోన్ జేమ్స్. రామ్ మిర్యాల, లియోన్ తమ ఎనర్జీటిక్ వొకల్స్ తో మెస్మరైజ్ చేశారు. శ్రీ హర్ష ఈమాని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లో నారా రోహిత్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. ఓవరాల్‌గా, హమ్మయ్య సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మూవీ విడుదలకు సిద్ధమౌతోంది.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -