తెలుగు కుటుంబం..6 శాసనాలు:లోకేష్

6
- Advertisement -

మహానాడులో మంత్రి నారా లోకేష్ నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు ప్రకటించారు. 1. తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2. పేదలకు సేవలో సోషల్ రీయింజినీరింగ్స్ , 3. స్త్రీ శక్తి, 4. అన్నదాతకు అండగా, 5. యువగళం, 6. కార్యకర్తే అధినేత అని తెలిపారు.

ఈ 6 శాసనాలను తప్పకుండా అమలు చేస్తాం…. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం నడవాలి అన్నారు.

మనకు ప్రతిపక్షం కొత్తకాదు.. అధికారం కొత్తకాదు….. తెలుగువాళ్లు ఎక్కడ ఇబ్బందిపడ్డా స్పందించేది టీడీపీ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరం…. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతం అన్నారు లోకేష్‌.

Also Read:పాక్‌కు సరైన జవాబిస్తాం:మోదీ

- Advertisement -