- Advertisement -
ఆంధ్రప్రదేశ్…సీఎం జగన్ తాత జాగీరు కాదన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. 3, 4 విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ….వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా… టీడీపీ హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. వైసీపీ మద్దతుదారులు 95 శాతం పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలవాలని టార్గెట్ పెట్టారు.
దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా 3,4 విడతల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు.
- Advertisement -