ఏపీ రాజకీయాల్లో గత 20 రోజులుగా ప్రతిపక్ష టీడీపీని స్కామ్ ల బెడద పట్టిపిడిస్తోంది. ఇప్పటికే నేత చంద్రబాబు నాయుడు రిమాండ్ కస్టడీలో ఉన్నారు. ఆయనకు వచ్చే బెయిల్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు లోకేశ్ టార్గెట్ గా పలు స్కామ్ లు తెరపైకి వస్తున్నాయి. అమరావతి రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేశ్ ను ఏ 14 గా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో లోకేశ్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ ను ముందుగానే ఊహించిన లోకేశ్ ముందస్తు బెయిల్ కు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. .
మరోవైపు తనకు సంబంధం లేని స్కామ్ లో ఇరికెంచే ప్రయత్నం చేస్తున్నారని లోకేశ్ ఆరోపిస్తున్నప్పటికి పక్కా ఆధారాలు ఉన్నాయని సీఐడీ చెబుతోంది. ఇప్పటికే లోకేశ్ ను కస్టడీకి తీసుకునేందుకు ఏపీ సీఐడీ అన్నీ విధాలుగా సిద్దమైనట్లు టాక్. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు లోకేశ్ కూడా జైలుపాలు అయితే టీడీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తన అరెస్ట్ ను ముందుగానే అంచనా వేసిన లోకేశ్.. పార్టీ తదుపరి ప్రణాళికలను ముందుగానే నేతలకు వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నేతలు ఎలా ప్రజల్లో ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం జరుగుతున్నా ఈ అరెస్ట్ ల పర్వాన్ని పార్టీకి ఎలా అనుకూలంగా మాచుకోవాలనే దానిపై పక్క వ్యూహాలను రెడీ చేశారట. ఇలా ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న యువగళం పాదయాత్ర ఈ కేసుల నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ మొదలు పెడతారని టాక్. మొత్తానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ స్కామ్ లలో ధోషులుగా రుజువౌతూ ఉండడం టీడీపీని కలవర పెట్టె అంశం.