లోకేష్ పాదయాత్ర.. తగ్గేదెలే !

67
- Advertisement -

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర మంచి మైలేజ్ తీసుకొస్తుందని టీడీపీ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ పాదయాత్రకు సంబంధించి గత ఆరు నెలల నుంచి కసరత్తులు చేస్తూ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఆ మద్య జగన్ సర్కార్ నుంచి అనుమతి రాకపోవడంతో జగన్ వైఖరిని తెలుగు తమ్ముళ్ళు తీవ్రంగా తప్పుబడుతూ వచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒన్ కూడా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రవేశపెట్టారని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం జీవో నెంబర్ ఒన్ పై కోర్టులో స్టే ఉన్నప్పటికి లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరుగుతూనే వచ్చింది. .

ఇక ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి షరతులతో కూడిన అనుమతి లభించింది. వాహనదారులకు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగించరాదని, రోడ్లపై సమావేశాలు నిర్వహించరాదని, బాణసంచా పేల్చరాదని ఇలా 14 రకాల షరతులతో లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు పోలీసులు. దీంతో అనుకున్న దాని ప్రకారమే లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పంలో బహిరంగ సభ ద్వారా పాదయాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇక లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అలాగే పార్టీ విధానాలను ఈ పాదయాత్రలో బలంగా ప్రస్తావించనున్నారు లోకేష్. మరి వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై కావడంతో లోకేష్ పాదయాత్ర ఆ పార్టీకి ఎంతవరకు మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -