డీఎస్సీ నియామక పత్రాల పంపిణీపై లోకేశ్

6
- Advertisement -

డీఎస్సీ నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అడ్డంకులను అధిగమించి డీఎస్సీ నిర్వహించి టీచర్లను నియమించామని తెలిపారు లోకేశ్.

రేపు జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కూడా రావాలని ఆహ్వానం పంపామన్నారు. డీఎస్సీ నియామకాల అంశంలో మంత్రి లోకేశ్ చొరవను అభినందించారు డిప్యూటీ స్పీకర్ రఘురామ.

డీఎస్సీ అడ్డుకోవడం కోసం వైసీపీ వందకు పైగా కేసులు వేసింది.. అన్నింటినీ అధిగమించి డీఎస్సీ నిర్వహించి టీచర్లను నియమించాం అన్నారు. ఎమ్మెల్యేలు వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాం అన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్, డిజైన్ తో విద్యార్థులకు అత్యుత్తమమైన కొత్త యూనిఫాం ఇచ్చాం.. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పిల్లలకు స్కూల్ లో కిట్లు అందిస్తున్నాం అని చెప్పారు.

Also Read:TGPSCకి హైకోర్టులో ఊరట

- Advertisement -